- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పినపాకను వెంటాడుతోన్న డెంగ్యూ.. యువతి మృతి
by Sumithra |
X
దిశ, మణుగూరు : ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో డెంగ్యూ జ్వరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. విషజ్వరాలు నియోజకవర్గంలోని ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి. గత రెండు, మూడు నెలల నుంచి డెంగ్యూ జ్వరంతో పలువురు మృతి చెందగా, వందలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా అశ్వాపురం మండలం హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగి బొలిశెట్టి శ్రీనివాస్ కూతురు గత నాలుగు రోజుల నుంచి డెంగ్యూ ఫీవర్‌తో బాధపడినట్టు సమాచారం.
అయితే, డెంగ్యూ జ్వరం తీవ్రం కావడంతో హైద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు కిమ్స్ హాస్పిటల్‌లో మృతి చెందినట్టు తెలిసింది. కళ్ల ముందే కూతురు డెంగ్యూతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Advertisement
Next Story