సైబర్ క్రైమ్..నగ్నచిత్రాల పేరుతో డబ్బులు డిమాండ్

by Sumithra |
సైబర్ క్రైమ్..నగ్నచిత్రాల పేరుతో డబ్బులు డిమాండ్
X

దిశ, క్రైమ్ బ్యూరో :
సాధారణంగా యువతుల నగ్న వీడియోలను చిత్రీకరించి, బెదిరించి డబ్బులు లాగడం లాంటి ఘటనలు అబ్బాయిలు చేస్తుంటారు. కానీ, అందుకు భిన్నంగా యువకుడిని నమ్మించి నగ్న వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతోంది ఓ యువతి. పోలీసులే షాక్‌కు గురైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

బర్కత్ పురాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఇన్స్టాగ్రామ్‌లో డింపుల్ అనే యువతి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ న్యూడ్‌గా చాటింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే యువకునికి చెందిన బంధువుల కాంటాక్ట్ నెంబర్లను ఆమె సేకరించింది. అనంతరం ఓ బంధువుకు యువకుని న్యూడ్ ఫోటోలను పంపింది. మరల ఇతరులకు అలా పంపకుండా ఉండాలంటే రూ.1 లక్ష ఇవ్వాలని డింపుల్ డిమాండ్ చేసింది. లేదంటే మీ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించింది. ఇలా ఆ యువకుడి నుంచి వారంలో రూ.3.5 లక్షలను తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది.అంతటితో ఆగకుండా, మరో రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఆమె వేధింపులు తీవ్రతరం కావడంతో బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు.ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మరణించిన వ్యక్తి అకౌంట్ నుంచి..

సమీప బంధువు మరణించిన 15 రోజులకు, అతని అకౌంట్ నుంచి రూ.15 లక్షల నగదును కొట్టేసిన ఘటన అబిడ్స్‌లో చోటు చేసుకుంది. అబిడ్స్ కు చెందిన డాక్టర్ సత్తువ లేకర్ తన బంధువు క్రాంతికుమార్ 15 రోజుల కిందట మరణించాడు. ఈ క్రమంలోనే అతని అకౌంట్ నుంచి రూ.15 లక్షలు ఆన్ లైన్ ద్వారా వేరే ఖాతాలోకి ట్రాన్స్‌‌ఫర్ అయ్యాయి. విషయం తెలుసుకున్న సత్తువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఓఎల్ఎక్స్, కేవైసీ, ఓటీపీ పేరుతో రూ.4 లక్షలు మోసపోయినట్టు 5 గురు వ్యక్తులు బుధవారం సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ ద్వారా డబ్బులు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరారు. అఫ్జల్‌ గంజ్ గౌలిగూడలోని ఓ స్వీట్ షాపులో కరోనా వచ్చిందంటూ వాట్పాప్ ద్వారా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని షాపు యాజమాని సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Next Story

Most Viewed