- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ. 5,999/-కే ‘జియోనీ మ్యాక్స్’ స్మార్ట్‌ఫోన్

దిశ, వెబ్‌డెస్క్ :
చైనీస్ మొబైల్ తయారీదారు జియోనీ.. ‘మ్యాక్స్’ పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 31 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. ఆక్టాకోర్ ప్రాసెసర్, డ్యుయల్ రేర్ కెమెరా, లార్జ్ బ్యాటరీ ఫీచర్లతో బడ్జెట్ రేంజ్‌లో జియోనీ.. ఈ స్మార్ట్ ఫోన్‌ను తీసుకురాగా, మూడు రంగుల్లో లభించనుంది. ఇటీవల కాలంలో స్మార్ట్ లైఫ్ వాచీలు, పవర్ బ్యాంకులు, నెక్‌బ్యాండ్‌లు, హెడ్‌ఫోన్‌లు, వైర్‌లెస్ బ్లూ టూత్ తదితర వేరబుల్స్‌ను కూడా జియోనీ లాంచ్ చేసింది.
జియోనీ మ్యాక్స్ ఫీచర్స్ :
డిస్‌ప్లే : 6.10 ఇంచులు
ప్రాసెసర్ : ఆక్టాకోర్ ప్రాసెసర్ యునిసోక్ 9863ఎ ఎస్‌వోసీ ( Unisoc 9863A SoC)
ర్యామ్ : 2జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 32జీబీ
రేర్ కెమెరా : 13 మెగాపిక్సల్
ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్సల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
రంగులు : రెడ్, బ్లాక్, బ్లూ
ధర : రూ. 5,999/-