- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాకి ఇన్‌హెలర్…రెమ్‌డెసివిర్ ప్రయోగాలు!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కోసం ఇప్పటికే అనేక కంపెనీలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. తాజాగా కరోనా వైరస్ బారిన పడిన వారి కోసం రెమ్‌డెసివిర్‌ను సరికొత్త రూపంలో ఆవిష్కరించేందుకు గిలియడ్ సైన్సెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఇంజెక్షన్ రూపంలో ఇస్తున్న రెమ్‌డెసివిర్‌ను ఇన్‌హెలర్ రూపంలో ఉపయోగించే అంశంపై పరీక్షలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరీక్షల కోసం 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న సుమారు 60 మందిని ఎంపిక చేసి పరీక్షలు జరుపుతున్నట్లు కంపెనీయే స్వయంగా ప్రకటించింది. ఒకవేళ ఈ ప్రయోగం సక్సెస్ అయి ఇన్‌హెలర్ అందుబాటులోకి వస్తే పాజిటివ్ వచ్చిన వారు ఆస్పత్రికి వెళ్లే పనుండదు. కొత్త విధానంతో నెబులైజర్ ద్వారా కరోనా ఔషధాన్ని వ్యాధి సోకిన వారు వినియోగించవచ్చు. పైగా, ఈ విధానం ద్వారా వ్యాధి సోకిన వ్యక్తి శరీరంలో ఇన్ఫెక్షన్ సోకిన భాగంలో ముందుగా నయం చేయగలిగే వీలుంటుందని కంపెనీ అభిప్రాయపడింది. కాగా, ఇటీవల భారత్‌లో కరోనా వైరస్ సోకిన వారికి అత్యవసరంగా డాక్టర్ల పర్యవేక్షణలో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసందే.