కంటైన్‌మెంట్ నిబంధనలు పాటించాలి : నగర మేయర్

by Aamani |
కంటైన్‌మెంట్ నిబంధనలు పాటించాలి : నగర మేయర్
X

దిశ, న్యూస్‌బ్యూరో : కంటైన్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని జీహెచ్‌ఎంసీ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు. ఎల్బీన‌గ‌ర్ జోన్‌లోని ఆర్కేపురంలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్ ప్రాంతంలో ఆయన శనివారం ప‌ర్య‌టించారు. కొవిడ్‌-19 వ్యాప్తిని పూర్తిగా అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను గుర్తించి, తీర్చేందుకు జీహెచ్‌ఎంసీ నోడ‌ల్ ఆఫీస‌ర్లు అందుబాటులో ఉన్నార‌ని తెలిపారు. మొబైల్ రైతు బ‌జార్ల ద్వారా కూర‌గాయ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు వెల్లడించారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నెంబ‌ర్ 040-2111 11 11కు లేదా నోడ‌ల్ ఆఫీస‌ర్‌కు ఫోన్ చేయాల‌ని సూచించారు. కంటైన్‌మెంట్‌ ప‌రిధిలో ఉన్న ఇండ్ల నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని, కొద్ది రోజులపాటు ప్ర‌భుత్వానికి పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసమే ప్ర‌భుత్వం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. రోడ్ల‌పై ఉమ్మివేసినా, మాస్కులు ధ‌రించ‌క‌పోయినా క్రిమిన‌ల్ కేసులు న‌మోదవుతాయ‌ని హెచ్చ‌రించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎల్బీన‌గ‌ర్‌ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి, కార్పొరేట‌ర్లు రాధ‌, చెరుకు సంగీత‌ ప్ర‌శాంత్‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags : Continement Rules, GHMC Mayor, Nodal Officers, Corona

Advertisement

Next Story

Most Viewed