- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగరంలో మేయర్ పర్యటన
దిశ, న్యూస్ బ్యూరో: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కాప్రా సర్కిల్ సాయిబాబా నగర్ కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలనీ, పారిశుధ్య పనులు, స్ప్రేయింగ్ ఎప్పటికప్పుడు చేయించాలని అధికారులను ఆదేశించారు.
మేయర్‌తో పాటు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డీసీ శైలజ, కార్పొరేటర్ స్వర్ణరాజ్ ఉన్నారు. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సిహెచ్. మల్లారెడ్డితో కలిసి జవహర్ నగర్ డంపింగ్ యార్డు పనులు పరిశీలించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రూ.144 కోట్ల వ్యయంతో క్యాపింగ్ పనులు చేస్తున్నట్లు మేయర్ వివరించారు. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అన్నపూర్ణ ద్వారా భోజన వసతిని కల్పించినట్లు మేయర్ తెలిపారు. జవహర్ నగర్, దమ్మాయిగూడ ప్రజలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. దమ్మాయిగూడ నుంచి హరిదాసు పల్లి వరకు హెచ్‌ఆర్‌డీసీ ద్వారా చేపట్టిన రోడ్డు విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించారు.
Tags: Lockdown, GHMC, Mayor, Bonthu, minister mallareddy, works inspection