ఇవి అన్ని వయస్సులవారికి ఉపయోగకరం

by Shyam |
ఇవి అన్ని వయస్సులవారికి ఉపయోగకరం
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహా నగరాన్ని హరితనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. ఐఎస్ సదన్ మోహన్ నగర్ కాలనీలో సోమవారం మహా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కును ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి కాలనీలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు గ్రేటర్ హైద్రాబాద్ లో 320 పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొద్దిపాటి విస్తీర్ణం ఉన్న‌ప్ప‌టికీ వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌, చిన్న‌పిల్ల‌ల ఆట వ‌స్తువులు, వృద్ధులు, మ‌హిళ‌లకు ఉప‌యోగ‌ప‌డేవిధంగా పార్కులను రూపొందించి అందుబాటులోకి తెస్తున్నట్లు మేయర్ తెలిపారు.

కార్పొరేటర్ల సహకారంతో పార్కులలో వసతులు కల్పించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, ఇవి అన్ని వయస్సుల ప్రజలకు ఉపయోగపడే విధంగా వసతులు కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా అలాగే 50 థీమ్ పార్కులను, 120 జంక్ష‌న్ల‌ను అభివృద్ధఇ చేస్తున్న‌ట్లు మేయ‌ర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులతో మేయర్‌ మాట్లాడుతూ రోడ్ల‌పై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ చెత్త వేస్తున్నవారిని గుర్తించి అటువంటి వ్య‌క్తుల‌కు పారిశుధ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆదేశించారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన యూనిఫామ్ ను విధుల‌లో ఉన్న స‌మ‌యంలో త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, లేని పక్షంలో క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సామ స్వప్న సుందర్ రెడ్డి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ అశోక్ సామ్రాట్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్ మంగ‌త‌యారు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed