- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోల్తా పడ్డ జీహెచ్ఎంసీ చెత్త లారీ.. కార్మికులు సేఫ్
దిశ, సిటీ బ్యూరో: మహానగరంలో వివిధ ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి, దాన్ని ఎంజీబీఎస్ సమీపంలోని ట్రాన్స్ ఫర్ స్టేషన్‌కు తరలించే లారీ గురువారం బోల్తా పడింది. అదృష్టవశాత్తు అందులో విధి నిర్వహణలో కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. సాయంత్రం నాలుగు గంటలకు చెత్తను ట్రాన్స్ ఫర్ స్టేషన్‌లో డంప్ చేసేందుకు వచ్చిన లారీ, చెత్తను హైడ్రాలిక్ మెషిన్‌తో ఖాళీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా చెత్త ఒకవైపుకు పడటంతో అదుపుతప్పి పడిపోయింది. లారీ చాలా నెమ్మదిగా బోల్తా పడటంతో అందులోని డ్రైవర్ చాకచక్యంగా బయటపడ్డాడు. ఈ వాహనాన్ని బల్దియా రాంకీ ఎన్విరో సంస్థ నుంచి కొంతకాలం క్రితం కొనుగోలు చేసినట్లు కార్మికులు వెల్లడించారు. ప్రతిరోజు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్త సేకరించి ఎంజీబీఎస్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు తెచ్చి, అక్కడ డంప్ చేసి, తిరిగి రాత్రికి అదే చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తుంది.
రోజుకు సుమారు 18 గంటల పాటు నిరాటంకంగా నడిపే ఈ వాహనానికి కనీస నిర్వహణ లేకపోవటం వల్లే అదుపు తప్పి పడిపోయిందని ఘటనా స్థలాన్ని సందర్శించిన బీజేపీ మజ్దూర్ మోర్చా సిటీ చైర్మన్ ఊదరి గోపాల్ ఆరోపించారు. ఏడాదిన్నర క్రితం ఇదే తరహాలో మరో వాహనం బోల్తా పడటంతో హాజీఖాన్ అనే ఔట్ సోర్సింగ్ కార్మికుడు, అరిఫుద్దీన్ అనే పర్మినెంట్ ఉద్యోగి మృతి చెందారని తెలిపారు. అయితే, అధికారులు కనీసం ఈ ఘటనతో కూడా కళ్లు తెరవకుండా, ఎప్పటికప్పుడు పరీక్షించకుండా కార్మికులు ప్రాణాలు కొల్పోయేందుకు కారకులవుతున్నారని మండిపడ్డారు. బల్దియా ఖజానా దివాలా చేసేందుకే గాక, జీహెచ్ఎంసీ కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసేందుకు కారణమవుతున్న రాంకీ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసి, చెత్త సేకరణకు బల్దియా కొత్త వాహనాలను కొనుగోలు చేయాలని గోపాల్ డిమాండ్ చేశారు.