బ్యాలెట్ పద్దతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

by Shyam |
బ్యాలెట్ పద్దతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తున్నామని ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి తెలిపారు. రాష్ర్టంలో కరోనా మహమ్మారి విస్తతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ పేర్కొన్నారు. అంతేగాకుండా దీనిపై అన్ని పార్టీల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తామని అన్నారు.

Advertisement

Next Story