ఎర్లీబ‌ర్డ్‌కు మిగిలింది 5 రోజులే !

by Shyam |
ఎర్లీబ‌ర్డ్‌కు మిగిలింది 5 రోజులే !
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్ర‌భుత్వం క‌ల్పించిన ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కానికి 5రోజులు మాత్రమే మిగిలి ఉందని, పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్ మంగళవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఈ నెల 31 లోపు ఆస్తిప‌న్నును చెల్లించి, ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కం కింద 5శాతం ప‌న్ను రాయితీ పొందాల‌ని సూచించారు. గ‌తంలో నివాస గృహాల‌కు మాత్ర‌మే ప‌రిమిత స్థాయిలో ప‌న్ను రాయితీ ఉండేద‌ని, వివిధ వ‌ర్గాల నుంచి అందిన విజ్ఞాప‌న‌ల మేర‌కు వాణిజ్య ఆస్తులు, మిక్స్‌డ్ గృహాల‌కు కూడా ప‌న్ను రాయితీని ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఆస్తిప‌న్నును ఆన్‌లైన్‌, సిటీజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, ఈ-సేవా కేంద్రాల ద్వారా చెల్లించ‌వ‌చ్చన్నారు. మ‌ల్టీ లెవల్ మాల్స్‌, స్టార్ హోట‌ల్స్‌, పెద్ద వ్యాపార సంస్థ‌లు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని సూచించారు.

Advertisement

Next Story