మణిపూర్ నారింజ పండ్లకు భౌగోళిక గుర్తింపు

by Shamantha N |
Manipur oranges
X

ఇంపాల్: మణిపూర్ నారింజపండ్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. మాండ్రిన్ కుటుంబానికి చెందిన తమెంగ్లాంగ్, మరో రకం నారింజ జాతి హతేయ్‌కు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికెషన్ (జీఐ)) వచ్చింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ‘మణిపూర్‌‌ గొప్ప వార్తతో ఈ ఉదయాన్ని ప్రారంభించింది. రాష్ట్రానికి చెందిన రెండు రకాల నారింజ పండ్లు హతేయ్ చిల్లీ, తమేంగ్లాంగ్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చిందన్న వార్త మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఇది మణిపూర్ చరిత్రలో ఒక మైలు రాయి. ఈ గుర్తింపుతో రాష్ట్రంలోని రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.

కాగా తమేంగ్లాంగ్, హతేయ్ రకాలకు జీఐ గుర్తింపు కోసం మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ(ఎంఎమ్ఏ) తరఫున 2019లో దరఖాస్తు చేసినట్టు ప్రాజెక్టు డైరెక్టర్ దేబ్‌దత్త శర్మ తెలిపారు. త్వరలోనే జీఐ సర్టిఫికెట్లను జారీ చేస్తారని చెప్పారు.

Advertisement

Next Story