‘రత్నాలు, ఆభరణాల వ్యాపారం కోలుకుంటోంది’

by Harish |
‘రత్నాలు, ఆభరణాల వ్యాపారం కోలుకుంటోంది’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం తర్వాత వజ్రాల వ్యాపారం (Diamond trade) కరోనా నుంచి బయటపడగలదని పరిశ్రమ వర్గాలు (Industry categories) భావిస్తున్నాయి. కర్మాగారాల నుంచి వజ్రాల ఉత్పత్తి (Production of diamonds) పెరగడంతో పాటు అమెరికా, చైనా, యూరప్‌ల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రత్నాలు, ఆభరణాల వ్యాపారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాలలో తమ వ్యాపారం కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ పరిణామాలను అనుసరించి వ్యాపారులు ఎగుమతుల అంచనాను సవరించారు. 2020-21లో మొత్తం రత్నాలు, ఆభరణాల (Gems, jewelry) రవాణా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 20-25 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఇదివరకు ఎగుమతులు 50 శాతం తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేశారు. 2019-20లో దేశంలో జరిగిన మొత్తం రత్నాలు, ఆభరణాల ఎగుమతుల విలువ సుమారు రూ. 2.11 లక్షల కోట్లు.

జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ (Gems and Jewelery Export Council) వివరాల ప్రకారం.. ఈ విభాగంలో ఎగుమతులు ఆగస్టులో సుమారు రూ. 12,410 కోట్లను తాకింది. ఇది ఏర్పిల్‌లో నమోదైన సుమారు రూ. 236 కోట్ల కంటే అత్యధికం. కానీ, 2019 ఆగస్టుతో పోలిస్తే 41.55 శాతం తగ్గింది. జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ ఛైర్మన్ కోలిన్ షా మాట్లాడుతూ..అనేక దేశాలు వాణిజ్యం కోసం ఆంక్షలు సడలించాయి. దీంతో సమీప కాలంలో తమ వ్యాపారాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. యూఎస్, చైనా, యూరప్ మార్కెట్ల నుంచి కోలుకుంటున్న సంకేతాలు చూడగలుగుతున్నాం. ఎగుమతుల ఆర్డర్లు గత 4-5 నెలల్లో స్థిరమైన వృద్ధిని చూస్తున్నామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed