రేవంత్ పాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

by Shyam |
రేవంత్ పాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారింది
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి పాత్ర పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని గల్లీ పదవిగా మర్చారని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ‘నవ్విపోదురు గాక .. నాకేమిటి సిగ్గు’ అన్నట్టుగా ఉందని మండిపడ్డారు. కొత్త సచివాలయాన్ని నిర్మించకుండా ఏడాదికాలం పాటు అడ్డుపడ్డ కాంగ్రెస్ నేతలు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక రోజుకో కొర్రీ‌తో కోర్టుకు వెళ్లడం వారి దిగజారుడు తనాన్ని సూచిస్తోందన్నారు.

Advertisement

Next Story