చెట్టు పైనుంచి పడి.. గీత కార్మికుడి మృతి

by Shyam |
చెట్టు పైనుంచి పడి.. గీత కార్మికుడి మృతి
X

దిశ, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో కోల రాజాగౌడ్(52) అనే గీతకార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… రాజాగౌడ్ రోజులాగే కల్లు తీయడానికి తాటిచెట్టు పైకి ఎక్కుతుండగా, మధ్యలో కింద పడి మృతిచెందాడు. మృతునికి భార్య కూతురు ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Advertisement

Next Story

Most Viewed