వారి స్ఫూర్తిగా ‘ఐ మిస్ యు వెరీ మచ్’ ఎగ్జిబిషన్..

by Shyam |
వారి స్ఫూర్తిగా ‘ఐ మిస్ యు వెరీ మచ్’ ఎగ్జిబిషన్..
X

దిశ, ఫీచర్స్ : 1967లో మధ్యప్రాచ్యం యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ తూర్పు జెరూసలెంను తమ అధీనంలోకి తెచ్చుకుంది. మొత్తం నగరాన్ని తమ రాజధానిగా భావించింది. అయితే అంతర్జాతీయ సమాజం దానిని అంగీకరించడం లేదు. పాలస్తీనా తూర్పు జెరూసలెంను భవిష్యత్తులో ఒక స్వతంత్ర దేశానికి రాజధానిగా చూస్తోంది. ఈ క్రమంలో 2016 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ జెరూసలెంలోని చారిత్రక అల్-అక్సా మసీదుపై యూదులకు ఎలాంటి హక్కు లేదని చెప్పింది. ఈ వివాదాస్పద తీర్మానంతో అక్కడ ఘర్షనలు మొదలు కాగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ 2019లో గాజాలోని రెండు మిలియన్ల మంది జనాభాలో కనీసం 1,600 మంది దివ్యాంగులు అయ్యారని ఓ నివేదిక విడుదల చేసింది. ఇజ్రాయెల్‌తో ఘర్షణ బాధితులు అనుభవించిన నష్టంతో స్ఫూర్తి పొందిన పాలస్తీనా కళాకారుడు ఖలీద్ హుస్సేన్ ‘ఐ మిస్ యు వెరీ మచ్’ అనే ఎగ్జిబిషన్‌ను గాజాలో ఏర్పాటు చేశాడు.

అస్సలామా ఛారిటబుల్ సొసైటీ, గాయపడిన, వికలాంగులుగా మారిన వ్యక్తుల గురించి శ్రమిస్తుంది. ఇజ్రాయెల్-గాజా ఘర్షణలో తమ అవయవాలను కోల్పోయిన వారికి స్ఫూర్తిగా హుస్సేన్ సగానికి తెగిపడ్డ కాలు, చేయి, ఇతర అవయవాల మాదిరి ఏడు శిల్పాలను ఈ నెలలో గాజా ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించాడు. ఈ శిల్పాలను మట్టితో తయారు చేయగా, అవి మన మనసులను మెలిపెట్టే విధంగా ఉన్నాయి.

ఇజ్రాయెల్‌తో గాజా సరిహద్దులో 2018, 2019లో జరిగిన పోరాటంలో గాయపడిన వారి కోసమే నేను వీటిని రూపొందించాను. ఒకరు పోగొట్టుకున్నదాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రపంచానికి డాక్యుమెంట్ చేసే కళాఖండంగా మారుస్తారని ఊహించలేదు’ అని ఖలీద్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed