‘మీము’.. షార్ట్ ఫిల్మ్‌కు గౌతమ్ మీనన్ ఫిదా!

by Jakkula Samataha |   ( Updated:2020-09-07 06:06:49.0  )
‘మీము’.. షార్ట్ ఫిల్మ్‌కు గౌతమ్ మీనన్ ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతీ వ్యక్తి కలలు కంటాడు.. వాటిని సాకారం చేసుకునేందుకు జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మనలో ఆ సామర్థ్యం ఉందా? అసలు ఆ కల కనేందుకు అర్హత ఉందా? రేయింబవళ్లు కష్టపడినా సరే, ఆ కల నెరవేరలేదంటే తప్పెవరిది? కలగనే స్వాతంత్ర్యం ఇచ్చిన దేవుడు.. అందుకు తగిన సామర్థ్యం ఇవ్వకుండా ప్రతీ క్షణం బాధపెడుతున్నాడంటే తప్పు మనదా? దేవుడిదా? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళీ షార్ట్ ఫిల్మ్ ‘మీము’.

పాటంటే ప్రాణం.. సంగీతం అంటే అమితమైన ప్రేమ.. ఏఆర్ రహమాన్ దగ్గర పాట పాడాలన్న లక్ష్యం.. ప్రతీ క్షణం అదే ధ్యాస.. ఇది ఓ ఇంట్లో పని చేసే వ్యక్తి డ్రీమ్. తప్పేం లేదు.. పని మనిషి అయితే డ్రీమ్స్ ఉండకూడదా? వాటిని ఫుల్‌‌ఫిల్ చేసుకోకూడదా? కానీ, ఆ కల మూగవాడిది అయితే.. ఎలా ఉంటుంది? ప్రతీరోజు ఎంత నరకం అనుభవిస్తాడు? అసలు మాట్లాడేందుకు, పాట పాడేందుకు గొంతు ఇవ్వని దేవుడు.. పాడాలన్న బలమైన కోరిక మాత్రం ఎందుకు ఇచ్చినట్లు? మన కలను సాకారం చేసుకునేందుకు, మన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు మన దగ్గర ఆ సామర్థ్యం ఉందా? లేదా? మనకు తెలుసు. కోరిక ఉండి అది సాధించలేననే భావన ప్రతీరోజు లోపల తొలిచి వేస్తుంటే ఎలా ఉంటుంది? లైఫ్ లాంగ్ అదే బాధ వెంటాడుతుంటే ఎలా ఉంటుంది? అనేది ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించారు.

కంటెంట్ అండ్ మెస్సేజ్ పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమాకు ఖుదోస్ చెప్తున్నారు నెటిజన్లు. డ్రీమ్ ఆన్ రీల్ నిర్మాణ సంస్థ, యాక్టర్ రిషి జాయ్ విజయ్ పర్‌ఫార్మెన్స్‌కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా మీము షార్ట్ ఫిల్మ్ టీమ్‌ను ప్రశంసించడం విశేషం. అద్భుతమైన సినిమా తీశారంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చిన ఆయన.. ఆల్ ది బెస్ట్ చెప్పారు.

దర్శకత్వం : విఘ్నేష్ అజిత్
రచయిత : రిషి జాయ్ విజయ్
సినిమాటోగ్రఫీ : రెంజు క్రిష్ణన్
ఎడిటింగ్: ఎ.ఎస్.అరవింద్
సంగీతం : అట్లీ ఏసుదాస్

Advertisement

Next Story