తుపాకి గాలింపునకు కోట్లు ఖర్చు

by Sumithra |   ( Updated:2020-03-08 00:22:03.0  )
తుపాకి గాలింపునకు కోట్లు ఖర్చు
X

అభ్యుదయవాదులు నరేంద్ర దాబోల్కర్‌, గోవింద పనేసర్‌, ఆచార్యుడు ఎం.ఎం.కలబురగి, సీనియర్‌ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ హత్యలకు ఉపయోగించిన తుపాకీని గాలించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం రూ.7.5 కోట్లు ఖర్చు చేసింది. తుపాకీ దొరక్కపోవడంతో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చార్జిషీట్ దాఖలు చేయడం సాధ్యం కాలేదు. ఇప్పటికే అరెస్టయిన నిందితులు తుపాకీని కాళీ నదిలో పడేశామని ఒకసారి, అరేబియా సముద్రంలో పారేశామని మరోసారి చెబుతూ వచ్చారు. చివరకు సముద్రంలో 40 అడుగుల లోతుకు స్కూబా డైవింగ్‌ ఉపకరణాలతో ద్వారా నిందితులు తుపాకిని పూడ్చిపెట్టారని తెలుసుకున్నారు. తుపాకి గాలింపు కోసం అయిన ఖర్చును మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సంయుక్తంగా భరిస్తాయని ప్రత్యేక దర్యాప్తు దళానికి నేతృత్వం వహిస్తున్న డీసీపీ ఎం.ఎన్‌.అనుచేత్‌ తెలిపారు. సీబీఐ అధికారులకు అనుబంధంగా తామూ దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. తుపాకీ దొరకడంతో త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story