పనులు అడ్డుకుంటే సహించం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హెచ్చరిక

by Shyam |
MLA Vodithala Satish Kumar
X

దిశ, హుస్నాబాద్: గౌరవెల్లి భూనిర్వాసితులకు 90% డబ్బులు చెల్లించామని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టును రూపకల్పన చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టును సందర్శించి తొలుత 1.4 టీఎంసీల నుంచి 8.2 టీఎంసీలకు రీడిజైన్ చేశారన్నారు. ప్రాజెక్టు మొదటి దశలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రూ.93 కోట్లు ఇవ్వగా, 8.2 టీఎంసీలకు రీడిజైన్ చేసిన తర్వాత రైతులకు రూ.6.95 లక్షల చొప్పున ఆర్అండ్ఆర్ ప్యాకేజీని ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. పరిహారాన్ని తీసుకొని కొంతమంది రైతులకు వడ్డీతో సహా రూ.8లక్షలు చొప్పున చెల్లించనట్లు తెలిపారు.

మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కంటే గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారం ఎక్కువిచ్చినా, రైతుల ఆందోళన చేపట్టి పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, మరో 10శాతం పనులు త్వరితగతిన పూర్తిచేసి గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు చేస్తోందన్నారు. నిర్వాసితులకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆందోళన చేయడం, కుట్రలు కుతంత్రాలు పన్నుతూ, పనులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా గోదావరి జలాలతో ప్రాజెక్టు నింపుతామని, పనులు అడ్డుకుంటే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ బాబు, వెంకట్రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, అన్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed