గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి తీవ్రగాయాలు

by Sumithra |
crime
X

దిశ, నల్లగొండ: గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళతో పాటు వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మల్లేపల్లివారిగూడెంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. తిప్పర్తికి చెందిన మహేశ్వరికి, మల్లేపల్లివారిగూడెం గ్రామానికి చెందిన గణేశ్‌కు రెండేండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గణేశ్ రోజులాగే కూలీ పనికి వెళ్లాడు. మహేశ్వరి ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది.

భారీ శబ్ధం, ఇంటిపై ఉన్న రేకులు గాలిలో ఎగిరిపడటంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలిలో ఉన్న భయంకర వాతావరణంలోకి స్థానికులు వచ్చి చూడగా ఇరువురు మహిళలు తీవ్రగాయాలతో ఉన్నారు. హుటాహుటిన వారిని నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి ముందు మహేశ్వరి రెండేళ్ల కుమార్తె ఇంటి బయట ఆడుకుంటూ ఉండటంతో, చిన్నారికి పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed