‘కరోనా ఇప్పట్లో పోదు.. ఇండియాలో ఐపీఎల్ జరగదు’

by Shyam |
‘కరోనా ఇప్పట్లో పోదు.. ఇండియాలో ఐపీఎల్ జరగదు’
X

దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి దేశాన్ని విడిచి ఇప్పట్లో పోదని, 2021 ప్రథమార్థం వరకు మనం వైరస్‌తో పోరాడిల్సిందేనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కరోనా ఇంత ఉధృతంగా ఉన్న సమయంలో దేశంలో ఐపీఎల్ నిర్వహించడం అసాధ్యమని, విదేశీ వేదికల్లోనే ఈ మెగా లీగ్ నిర్వహించాల్సి ఉంటుందని భావించాడు. యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో చేసిన లైవ్ చాట్‌లో ఐపీఎల్ భవితవ్యంపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాబోయే మూడునాలుగు నెలలు చాలా కష్టమైనవే. ఆ సమయాన్నంతా మనం ఎలాగోలా గడిపేయక తప్పదు. మన జీవితాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి కనీసం ఆరు నుంచి 10నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఇతర ప్రాణాంతక రోగాల మాదిరే దీనికి కూడా వ్యాక్సిన్ వస్తే, తిరిగి మానవ జీవితం సర్వసాధారణంగా మారుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడం కష్టమే’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed