- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నాం: గంగూలీ
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు కచ్చితంగా వెళ్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే, ఆటగాళ్ల క్వారంటైన్ కాలాన్ని తగ్గించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఒక జాతీయ టీవీ ఛానల్‌తో మాట్లాడిన గంగూలీ.. మెల్‌బోర్న్‌లో తప్ప ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. ఈ ఏడాది చివరికల్లా పరిస్థితి సర్దుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పాడు. అయితే, రెండు వారాల పాటు ఆటగాళ్లు హోటల్ రూమ్‌లకే పరమితం అయితే వారిపై మానసికంగా ఒత్తిడి పెరుగుతుందని, కాబట్టి క్వారంటైన్ సమయాన్ని కుదించేలా చర్యలు తీసుకోవాలని సీఏను కోరినట్లు వెల్లడించాడు. కాగా, రెండేళ్ల క్రితం భారత జట్టు ఆస్ట్రేలియాలో సిరీస్ నెగ్గింది. కానీ, ఈసారి అంత సులభంగా విజయం సాధించే అవకాశాలు లేవని గంగూలీ అభిప్రాయపడ్డారు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కానీ కొహ్లీసేన మరింత కష్టపడితే గానీ సిరీస్‌లో సత్ఫలితాలు సాధించలేమని ఆయన అన్నారు.