- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ స్థలంలో అక్రమ దందా
దిశ, క్రైమ్‌బ్యూరో: జవహర్‌నగర్, కీసర శివారు ప్రాంతాల్లోని తిమ్మాయిపల్లి గ్రామం సర్వే నెం 12 ప్రభుత్వ స్థలంలో గత 6నెలలుగా అక్రమంగా ఎర్రమట్టి, ఇసుక, కంకర తవ్వకాలు జరుపుతూ అక్రమార్జన చేస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ సెలవు దినాలు, ఆదివారాల్లో మాత్రమే రాత్రి సమయంలో అక్రమంగా తవ్వకాలు చేస్తూ లారీలు, ట్రిప్పర్లకు నింపుతూ గుట్టుచప్పుడు కాకుండా జోరుగా అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఉదయం 5గంటలలోపే తమ పనులన్నీ చక్క బెట్టుకుంటున్నారు. టన్నుకు రూ.వెయ్యి చొప్పున ఒక్కో లారీకి 20టన్నులు ద్వారా రూ.20 వేలను అక్రమార్జన చేస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్, స్థానిక జవహర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం అర్థరాత్రి 2గంటలకు మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు తిమ్మాయిపల్లికి చెందిన తిరుపతి యాదవ్‌తో పాటు మరో 18 మందిని అరెస్టు చేశారు. 13టిప్పర్ లారీలు, ఒక హిటాచీ వాహనం, 12 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.