- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం : రాజాసింగ్
దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నవరాత్రులకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బక్రీద్ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ సర్కార్, హిందూ పండుగలకు కావాలనే అడ్డంగులు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.
గణేశ్ ఉత్సవాలను నిర్వహించరాదని పోలీసు యంత్రాంగం అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోందని.. అలా చేస్తే ధూల్‌పేట్ గణేష్ విగ్రహాలను కేసీఆర్ ఫాంహౌస్‌కు తరలిస్తామని రాజసింగ్ స్పష్టంచేశారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసిన వారిపై బైండోవర్, రౌడీషీట్లు ఓపెన్ చేస్తే సహించేది లేదన్నారు.
నగరంలోని గణేష్ ఉత్సవ నిర్వాహకులకు బీజేపీ అండగా ఉంటుందని.. రాష్ట్ర మంత్రుల ఆదేశాలను పోలీసులు లెక్కచేయటం లేదన్నారు. మంత్రుల ప్రకటనలకు.. పోలీసుల ప్రవర్తనకు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నారు. పోలీసుల నీడలో ప్రభుత్వమే బక్రీద్ పండుగ నిర్వహించిందని.. ధూల్‌పేటలో కళాకారులు తయారుచేసిన విగ్రహాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి భక్తులకు అందజేయాలన్నారు. విగ్రహాల అమ్మకాలు జరగకపోతే నష్టపోయిన కళాకారులకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని రాజాసింగ్ ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.