భద్రాద్రిలో ఎత్తయిన మట్టి గణపతి.. పోటెత్తిన భక్తులు

by Sridhar Babu |   ( Updated:2021-09-10 07:34:23.0  )
భద్రాద్రిలో ఎత్తయిన మట్టి గణపతి.. పోటెత్తిన భక్తులు
X

దిశ, భద్రాచలం టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోటాపోటీగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఉత్సవ మండపాల వద్ద నిర్వాహకులు, భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. పీఓపీ విగ్రహాల నిమజ్జనంతో నీరు కలుషితం అయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సామాజిక శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ కోసం ఈసారి మట్టి విగ్రహాలకు గణేశ్ నవరాత్రుల ఉత్సవ కమిటీ వారు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి ఏరియాలో యంగ్ బాయ్స్ ఉత్సవ కమిటీ నెలకొల్పిన 13 అడుగుల విగ్రహం జిల్లాలోనే ఎత్తయిన మట్టి విగ్రహంగా నిలిచింది. భద్రాచలం‌ టౌన్ సీఐ స్వామి, ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి, టీఆర్‌ఎస్ నాయకులు నవాబ్, టీడీపీ నాయకుడు అజీమ్ తదితరులు ఈ గణేశ్ మండపాన్ని సందర్శించి పూజలు చేశారు. మట్టి విగ్రహం నెలకొల్పిన యువతని వారు అభినందించారు. ఈ మట్టిగణేశ్ విగ్రహాన్ని తిలకించడానికి భక్తజనం తరలివస్తున్నారు.

Advertisement

Next Story