తారల ఇంట్లో.. గణనాథుడి పూజలు

by Jakkula Samataha |
తారల ఇంట్లో.. గణనాథుడి పూజలు
X

కరోనా ఆంక్షలతో ‘వినాయక ఉత్సవాలు’ ఇంటికి పరిమితమైనప్పటికీ.. ఇంటిల్లిపాది కలిసి వినాయక చవితి సంబరాలను చక్కగా నిర్వహించుకున్నారు. సామాన్యులు, టాలీవుడ్, బాలీవుడ్ సెల‌బ్రిటీలు తమ ఇళ్ళ‌లో ప‌ర్యావ‌ర‌ణహిత వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను ప్ర‌తిష్టించి పూజ‌లు నిర్వ‌హించారు.

తెలుగు ప్రేక్ష‌కుల అభిమాన న‌టుడు చిరంజీవి శ‌నివారం 65వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఇక త‌న బ‌ర్త్‌డే రోజే వినాయ‌క చ‌వితి పండుగ కూడా రావ‌డంతో చిరంజీవి రెండింటిని కుటుంబ స‌భ్యుల మ‌ధ్య స‌ర‌దాగా జ‌రుపుకున్నారు. కాగా, చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఆచార్య మూవీ ఫ‌స్ట్‌లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ మెగా ఫ్యాన్స్‌కు పండుగ ఆనందాన్ని రెట్టింపు చేసింది. అల్లు అర్జున్, తన కుటుంబంతో కలిసి వినాయక చవితి ఘనంగా జరుపుకున్నాడు.

హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో సంప్ర‌దాయ వస్త్రధార‌ణ‌లో మంచు వారి కుటుంబ‌ స‌భ్యులంతా వినాయ‌కుడి పూజ‌లో పాల్గొన్నారు. మోహ‌న్‌బాబు స‌తీమ‌ణి, మంచు ల‌క్ష్మి, విష్ణు-వెరోనికా దంప‌తులు, పిల్ల‌లు గ‌ణ‌ప‌య్య‌కు పూజ‌లు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ వినాయక చవితిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. సంప్రదాయ వస్త్రాల్లో గణపతిని పట్టుకుని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించి, ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుంచి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్థిస్తున్నాను’ అంటూ తెలిపాడు.

ఇస్మార్ట్ బ్యూటీ న‌భా న‌టేష్ అందిరి కన్నా భిన్నంగా ఆలోచించింది. భక్తులంతా ఆ గణనాథుడ్ని పూలతో కొలిస్తే, నభా మాత్రం.. పూలతోనే ఏకదంతుడ్ని తయారు చేసింది. తాను తయారుచేసిన ఫ్ల‌వ‌ర్ ఫ్రెండ్లీ గ‌ణేషున్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దాంతో న‌భా న‌టేష్ టాలెంట్ చూసి నెటిజ‌న్స్ ఫిదా అయిపోయారు.

https://twitter.com/NabhaNatesh/status/1297060877166764032

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ‘మట్టి గణపతి‘ని పూజించింది. ఒకరికొకరు ప్రేమానురాగాలను పంచుకోవాలని, అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంది.

View this post on Instagram

“…संकटी पावावे निर्वाणी रक्षावे सुरवंदना जय देव जय देव जय मंगलमूर्ती दर्शनमात्रे मनकामना पुरती “✨💜 With this Aarti that will reverberate in many households, I pray to our beloved ‘Vighnaharta’ for the good health and peace of mind for everyone! With our undying spirit, let this Ganesh Chaturthi be celebrated with prayers, love and empathy for one another. गणपती बाप्पा मोरया🙏 Thank you again @shraddha.naik for my @planaplant eco friendly Ganpati 🌸 A request to everyone who is graced by Ganpati ji to please do the immersion at home in a bucket 🙏 and not pollute our beaches and the sea 💙 Photo by @siddhanthkapoor 🥰

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Aug 22, 2020 at 3:11am PDT

బాలీవుడ్ న‌టి అన‌న్య పాండే.. ముంబైలోని త‌న ఇంట్లో బొజ్జ గ‌ణ‌ప‌య్య‌కు పూజ‌లు చేసింది. ‘లవ్ యూ బొప్ప.. వెల్‌కం టూ హోమ్. అందరూ అష్టఐశ్వర్యాలతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అని కోరుకుంది.

https://www.instagram.com/p/CELxMvfgBfe/?utm_source=ig_web_copy_link

మిస్ వ‌ర‌ల్డ్ (2017), బాలీవుడ్ న‌టి మానుషి చిల్లార్ గ‌ణేశ్ చ‌తుర్థి వేడుకల్లో పాల్గొంది. వివిధ సంస్కృతుల‌కు సంబంధించిన వేడుకల్లో పాల్గొనడం అంటే నా త‌ల్లిదండ్రుల‌కు చాలా ఇష్టం. నేను హ‌ర్యానా వ్య‌క్తిని. ముంబై కూడా నా సొంతిల్లు లాంటిదే. ముంబైలో జ‌రిగే గ‌ణేశ్ చ‌తుర్థి వేడుక‌ల్లో పాల్గొన‌డ‌మంటే నాకిష్టం. గ‌ణేశ్ చ‌తుర్థిని ఇంట్లో నిర్వ‌హించాల‌ని అమ్మానాన్న‌తో చెప్పాను. వారు వెంట‌నే సరే అని చెప్పారు. ఇంట్లో వినాయ‌క చ‌వితిని జ‌రుపుకోవ‌డం ఇదే మొద‌టిసారి. ఇది నాకు చాలా ప్ర‌త్యేక‌మైన స‌మ‌యం. అందరి శాంతి, శ్రేయ‌స్సు కోసం గ‌ణేశుడిని ప్రార్థిస్తున్న‌ట్టు మానుషి చిల్లార్ తెలిపింది.

టాలీవుడ్ హీరో విశ్వ‌క్ సేన్ ప‌సుపుతో గ‌ణ‌నాథుడిని ఎంతో అందంగా త‌యారు చేసి అభిమానుల ప్ర‌శంస‌లు పొందుతున్నాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో విశ్వక్ సేన్ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ ప్ర‌స్తుతం క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా శ‌నివారం గ‌ణేష్ చ‌తుర్ధి కావ‌డంతో ఆయన త‌న ఇంట్లోనే భార్య మాన్య‌త‌తో క‌లిసి పండుగ జ‌రుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ప్ర‌తి సంవ‌త్స‌రం మాదిరిగా ఈ ఏడాది పండుగ‌ని ఘ‌నంగా చేయ‌క‌పోయినా, వినాయకుడిపై విశ్వాసం అలానే ఉంది. గణనాథుడు మన జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి, మనందరికీ ఆరోగ్యం, ఆనందం అందించాల‌ని కోరుకుంటున్నానని సంజ‌య్ పేర్కొన్నారు

Advertisement

Next Story