- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గండ్ర..
దిశ ప్రతినిధి, వరంగల్ : రాజకీయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పనైపోయిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. 1200 మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికే అన్నట్లుగా మారిందని అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నేత గండ్ర సత్యనారాయణ తన అనుచరులు, కొంతమంది ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీలో చేరారు.
ఈ చేరిక సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడు ఐతే ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, మాజీ ఎంపీ మధుయాష్కీతో పాటు పార్టీలోని వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ముఖ్య నేతలంతా హాజరయ్యారు.
బహిరంగ సభలో గండ్ర సత్యనారాయణకు రేవంత్‌రెడ్డి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌కు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, భూపాలపల్లి నుంచే కేసీఆర్‌కు హెచ్చరిక చేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.