- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే గండ్రపై గండ్ర సత్యనారాయణ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, చిట్యాల: జిల్లాలోని ఖనిజ సంపద, ఇసుకవనరులు, రైతుల భూములను దోచుకుంటూ గండ్ర వెంకటరమణారెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని ఏఐఎఫ్ బి రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. బుధవారం చిట్యాల మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్,ఏఐఎఫ్ బి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా ఆశీర్వాద బలంతోనే త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, రానున్న ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కేవలం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పదవులు, ప్యాకేజీలను పొందడం కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరారని, నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను నట్టేటా ముంచిన ఘనత కేవలం ఆయనకే చెందుతుందని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో అధికార పార్టీ నేతను సైతం వెనక్కు నెట్టి రెండో వరుసలో నిలిచానన్నారు. ఎలాంటి పదవులను ఆశించకుండా ప్రజా సమస్యల పోరాటానికి ముందు వరుసలో నిలుస్తున్నానన్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు ఆపద వస్తే కవచంలా ఉంటానని భరోసానిచ్చారు. నియోజకవర్గంలో పోస్టింగ్ ల కొరకు ఏ అధికారైనా ఎమ్మెల్యేకు ముడుపులు చెల్లించాల్సిందేనని ఆరోపించారు. అందుకే జిల్లాలో ఇంఛార్జీల పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే, అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతూ, ప్రశ్నించే వారిపైన ఇష్టరాజ్యాంగ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ నెల ఆఖరికాల్లా మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ బి జిల్లా నాయకుడు ముఖిరాల మధువంశీ కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, మాజీ జడ్పీటీసీ ఓరం సమ్మయ్య, ఎంపీటీసీలు అనీల్, సర్వు ఉమ, నాయకులు శంకర్, దబ్బెట రమేష్ రాయకొమురు, దొడ్డి కిష్టయ్య, పురేందర్‌రెడ్డి, బాస్కర్, కొండయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.