భద్రాద్రిలో ఘనంగా గాంధీ 152వ జయంతి వేడుకలు

by Sridhar Babu |
భద్రాద్రిలో ఘనంగా గాంధీ 152వ జయంతి వేడుకలు
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో 152వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఆయా మండలాల ప్రజాప్రతినిధులు బాపూజీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ..గాంధీ అడుగుజాడల్లో నేటి యువతరం నడవాలని, అహింస మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ అని పేర్కొన్నారు.

ఆంగ్లేయుల పాలన నుంచి మన దేశానికి విముక్తి చేయడానికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మాగాంధీ అని కొనియాడారు. సత్యం, అహింస సిద్ధాంతాలతో సామాన్య ప్రజల్లో సైతం జాతీయ భావాలు రేకెత్తించి బ్రిటీషువారి గుండెల్లో గుబులు పుట్టించి వారి నియంతృత్వ పాలనకు కళ్లెం వేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో అశ్వాపురం ఎంపీపీ ముత్తునేని సుజాత, మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటిసీ పాశం నరసింహారావు, కరివేద వెంకటేశ్వర్లు, అడపా అప్పారావు, పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోడిశాల రామనాధం, బోడా రమేష్, కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed