గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తొలగింపు

by vinod kumar |
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తొలగింపు
X

దిశ, న్యూస్ బ్యూరో: గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్ శ్రావణ్‌ను ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో డాక్టర్ రాజారావును నియమించింది. కాగా, డాక్టర్ శ్రావణ్‌ను రాష్ట్ర కరోనా కోఆర్డినేటర్‌గా నియమించింది. ఇప్పటివరకు ఆ బాధ్యతలను రాజారావు చూస్తూ ఉన్నారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, ఆ కేసులన్నింటినీ గాంధీ ఆస్పత్రికి తరలిస్తూ ఉన్న సమయంలో డాక్టర్ శ్రావణ్‌ను సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తొలగించడం గమనార్హం. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రావణ్ ఇకపైన ఆ బాధ్యతలకు మాత్రమే పరిమితమవుతారు. కరోనా కోఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలను చూస్తారు. కొత్తగా సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డాక్టర్ రాజారావు ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగాధిపతిగా కొనసాగుతూ కరోనా కోఆర్డినేటర్ బాధ్యతలను చూస్తున్నారు. అయితే ఇకపైన కోఆర్డినేటర్ బాధ్యతలను డాక్టర్ శ్రావణ్‌కు అప్పగించి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గానూ, జనరల్ మెడిసిన్ విభాగాధిపతిగానూ కొనసాగనున్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకోకుండా పేషెంట్లపై దృష్టి పెట్టాల్సిన బాధ్యతను కాదని ఎక్కువగా పరిపాలనాపరమైన అంశాలపైనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నందున డాక్టర్ శ్రావణ్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించినట్లు సమాచారం.

Tags: Telangana, Corona, Gandhi Hospital, Superintendent, RajaRao, Shravan

Advertisement

Next Story

Most Viewed