భారత గేమింగ్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు

by Harish |
భారత గేమింగ్ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ గేమింగ్ రంగంలో 15 శాతం వాటా ఉన్న భారత్ గత ఆరు నెలల కాలంలో సుమారు రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఓ నివేదిక తెలిపింది. రానున్న 12 నుంచి 18 నెలల కాలంలో ఈ పెట్టుబడులు రెండు రెట్లు పెరిగే అవకాశాలున్నాయని మాపిల్ కేపిటల్ అడ్వైజర్ అభిప్రాయపడింది. ‘దేశవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది గేమర్లు, పెట్టుబడిదారులు ఈ రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టారు. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న ఈ ధోరణికి అనుగుణంగా ఈ రంగంలో ఆర్థిక సంబంధిత ఆటలకు న్యాయసంబంధమైన అంశాల్లో స్పష్టత రావాల్సి ఉందని’ కంపెనీ తెలిపింది. కాగా, 2020 సెప్టెంబర్‌లో ప్రముఖ గేమింగ్ సంస్థ డ్రీమ్11లో సుమారు రూ. 1650 కోట్లు, మొబైల్ ప్రీమియర్ లీగ్‌లో రూ. 660 కోట్లు, నజారా టెక్నాలజీస్‌లో రూ. 500 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం దేశీయ గేమింగ్ పరిశ్రం వృద్ధి ఉన్నప్పటికీ, కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఆన్‌లైన్ గేంల డిమాండ్ తగ్గిపోయే అవకాశాలున్నాయని మాపిల్ కేపిటల్ అడ్వైజరీ వెల్లడించింది.

Advertisement

Next Story