- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గజ్వేల్ కోటపై కాంగ్రెస్ ఆశలు.. గెలుపు కోసం కొత్త వ్యూహాలు..
దిశ, గజ్వేల్: చాప క్రింద నీరులా పని చేయడం అంటారే సరిగ్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రేస్ పార్టీ ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది. పటిష్టమైన వ్యూహనికి రూపకల్పన చేయడంతో పాటు దాన్ని వంద శాతం అమలయ్యేలా పనిచేస్తున్నారు. హస్తం నేతల త్రయం ఏకాభిప్రాయంతో మెదక్ ఎంఏల్సీ స్థానాన్ని టార్గెట్ గా తీసుకుంది. స్థాన బలం ఉన్న చోట విజయం సాధించి సీటు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుండే ప్రాతినిధ్యం వహించడం, తనకు సన్నిహితుడిగా ఉన్న గజ్వేల్ డాక్టర్ యాదవ రెడ్డిని ఆ పార్ఠీ అభ్యర్థిగా బరిలో నిలపడంతో జిల్లాలో తమ పట్టును నిరూపించేందుకు కాంగ్రేస్ శ్రేణులు తెగ ఆరాటపడుతున్నాయి. ఓ దశలో నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు భారీగానే ఆఫర్లు ఇస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎవరి బలం ఎంత..?
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1027 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉండగా. ఈ నెల 10 తేదీన జరిగే ఓటింగ్ ప్రక్రియలో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థిగా యాదవరెడ్డి బరిలో ఉండగా హస్తం పార్టీ నుండి సంగారెడ్డి ఎమ్మేల్యే తూర్పు జగ్గారెడ్డి సతీమణి నిర్మల మరియు దుబ్బాకకు చెందిన నాయకుడు కోమటి రెడ్డి వెంకట నర్సింహ్మ రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు.
అయితే జిల్లాలో అధిక శాతం తెరాస పార్టీ ఎమ్మేల్యేలే నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదిలా వుంటే గజ్వేకు చెందిన యాదవరెడ్డి ప్రాంతీయంగా బలమైన నేతగా గుర్తింపు పోందినా, ఆయా నియోజక వర్గాల్లో కనీసం ముఖ పరిచయం కూడా లేదనే చెప్పుకోవాలి. గతంలో తాను జిల్లా స్థాయిలో పదవులు పోందనూ లేదూ. నాయకులతో సరైన సాన్నిహిత్యం లేదు. ఈ నేపథ్యంలో తెరాస పార్టీ ముఖ్యమంత్రి ఆశీస్సులు రెండిని బేరీజు వేసుకోని ఎంఏల్సీ బరిలో దిగారు.
మొదలైన క్యాంప్ రాజకీయం..
నల్లేరు మీద నడకే అనుకున్న తన విజయం కాస్త కష్ట తరంగా మారింది. పార్టీ నాయకులను కాపాడుకోవటం తలకు మించినా భారంగా తయారైంది. వారం ముందే క్యాంపుకు తరలించినా గెలుపు పై అనుమానాలు ఉన్నయంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. క్యాంపులో ఉన్న ఎంపీటీసీలు సంతృప్తిగా లేరట, మరి కోందరు నాయక గణం కథ ఇంకా అనుమానమేనట. ఇన్నాళ్ళు తమకు కనీస విలువ ఇవ్వని అధిష్టానం, తెరాస ప్రభుత్వం ఎన్నికలు అనే సరికి గుర్తుకు వచ్చామా అంటూ క్యాంపులో గుసగుసలాడుతున్నారట.
దూకుడు పెంచిన కాంగ్రేస్
హస్తం అభ్యర్థి నిర్మల ఎంఎల్సీ రేసులో దూసుకు పోతున్నారు. ఉమ్మడి జిల్లాలో జగ్గారెడ్డికి విపరీతమైన పట్టు, ఫాలోయింగ్ ఉండటం, గత కాంగ్రేస్ హయాంలో విప్ గా, మూడు సార్లు ఎమ్మేల్యేగా పని చేసిన అనుభవం, నియోజకవర్గాల్లో నాయకులతో ఉన్న అనుబంధం బాగా వర్కవుట్ అవుతుందని కాంగ్రేస్ శ్రేణులు అనుకొంటున్నాయి. కాంగ్రేస్ అగ్ర నేతల త్రయం జహీరాబాద్ గీతారెడ్డి ,అందోల్ దామోదర్ రాజనర్సింహ్మ, గజ్వేల్ నర్సారెడ్డి, దుబ్బాక ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఎన్ఎస్ యూఐ లు రంగంలోకి దిగాయట.
ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపుపై సంయుక్త దృష్టి సారించడంతో కాంగ్రేస్ కు గెలుపు ఆశలు చిగురించాయి. కేసీఆర్ పై ఉన్న అసంతృప్తిని తమకు అనుకూల ఓటుగా మల్చుకోవాలని తీర్మానించాయట కాంగ్రేస్ శ్రేణులు. ఈ ఎంఎల్సీ ఎన్నికల్లో వ్యూహత్మక గెలుపు సాధించి జిల్లాలో పార్టీ పట్టును నిరూపించాలనే ధృడ నిశ్చయంతో ఉంది హస్తం పార్టీ.
భయం గుప్పెట్లో టీఆర్ఎస్..
టీఆర్ఎస్ ను జిల్లాలో పరాభవం పాలు చేయాలన్న సంకల్పంతో ఉన్న దుబ్బాక ఎమ్మేల్యే రఘు నందన్ కు ఈ ఎన్నికలు బాగా కలిసోచ్చాయని భాజాపా వర్గం అంటోంది. ఉప ఎన్నికల్లో గెలుపోందిన తర్వాత రఘునందన్ స్థానికంగా బాగానే పట్టు సాధించారు. ఇప్పటికే చాలా శాతం గ్రామీణ నాయక గణం భాజాపా తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో బలమైన శక్తిగా మారింది. అయితే శత్రువుకు శత్రువు తమకు మిత్రుడే అన్న చందంగా ‘‘రావు‘‘ సపోర్ట్ తమకే ఉందంటున్నాయి కాంగ్రేస్ శ్రేణులు. తమ అభ్యర్థి లేకపోవడంతో ఎమ్మేల్యే సాబ్ వర్గం సైతం నిర్మల వైపే మెుగ్గు చూపుతుందని ఆపార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
గెలుపు పై నివేదికలు..
ఇంటిలిజెన్స్ రిపోర్టులో మెదక్ ఎంఎల్సీ అంశం నెగిటివ్ గా రావడం వల్లే సీఎం ఈ వ్యాఖలు చేశారని తెరాస శ్రేణులను నిరుత్సాహ పరుస్తున్నాయట. ఈ క్రమంలోనే క్యాంపులో ఉన్న నేతల చరవాణిలను సైతం బంద్ చేయించారని ఆ పార్టీ శ్రేణులే పేర్కోంటున్నాయి. కాంగ్రెస్ చేస్తున్న వ్యూహలు సక్సెస్ అయితే మెదక్ ఎంఎల్సీ మరో హూజూరాబాద్ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఉమ్మడి జిల్లాలో తెరాస, కాంగ్రేస్ ఢీ అంటే ఢీ అనే స్థితే నెలకొంది. ఈ వార్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే..