- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావిలో పడిపోయిన రాజేంద్ర ప్రసాద్..
దిశ, సినిమా : ‘గాలి సంపత్’ బోలెడంత ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు బ్యూటిఫుల్ ఎమోషన్స్ అందించబోతోందని తెలిపింది మూవీ యూనిట్. శ్రీ విష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. కాగా ఈ చిత్రం మార్చి 11న రిలీజ్ అవుతుండగా మేకర్స్ ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో మీడియాతో మాట్లాడిన మూవీ యూనిట్.. సినిమా విశేషాలను పంచుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సినిమాకు అనీష్ దర్శకులు కాగా షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన అనిల్ రావిపూడి.. తన ప్రతీ సినిమాకు సంబంధించిన స్టోరీ సిట్టింగ్స్‌లో కీలకమైన కో డైరెక్టర్, రైటర్ అయిన ఎస్ కృష్ణ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతుండటంతో కథ సెట్ చేసి వెళ్దాం అనుకున్నానని తెలిపాడు. కానీ ఈ స్టోరీలో ఉన్న మ్యాజిక్ మిస్ కాకూడదనే టీమ్ వర్క్‌తో ముందుకు సాగామన్నాడు. మూవీలో రాజేంద్ర ప్రసాద్‌కు యాక్సిడెంట్ జరుగుతుందని.. ఈ ప్రమాదం జరిగాక తన గొంతులో నుంచి గాలి తప్ప మాటరాదని, తను మాట్లాడుతున్నప్పుడు ఒక చిలిపి భాష ఉంటుందని.. అదే ఫి.. ఫి.. ఫీ.. లాంగ్వేజ్ అని తెలిపాడు. ఈ లాంగ్వేజ్ సినిమాలో బోలెడన్ని నవ్వులను పంచుతుందన్న అనిల్.. అలాంటి ‘గాలి సంపత్’ 30 అడుగుల లోతు ఉన్న బావిలో పడితే ఏం జరిగిందనే విషయంతో సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా సాగుతూ సూపర్ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుందన్నారు. సినిమాకు సమర్పకులుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, శిరీష్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు అనిల్ రావిపూడి.