మళ్లీ వాయిదా వేస్తే జీరో అకడమిక్ ఇయర్!

by Shamantha N |
మళ్లీ వాయిదా వేస్తే జీరో అకడమిక్ ఇయర్!
X

న్యూఢిల్లీ: నీట్, జేఈఈ వాయిదావేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్న దశలో పరీక్షలను నిర్వహిస్తేనే మంచిదని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వీ రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. నీట్, జేఈఈలను మళ్లీ వాయిదా వేస్తే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

ఇప్పటికే ఆరు నెలల కాలానికి ఎక్కువే నష్టపోయామని, మళ్లీ వాయిదా వేస్తే మాత్రం ఈ ఏడాది జీరో అకడమిక్ ఇయర్‌గా మారుతుందని హెచ్చరించారు. అదే జరిగితే, బిజీ బిజీగా ఉన్న ఐఐటీ అకడమిక్ క్యాలెండర్‌కు బలమైన సవాల్‌ను విసురుతుందని తెలిపారు. రెండు బ్యాచ్‌ల విద్యార్థులను ఒకేసారి హ్యాండిల్ చేయడం కష్టతరమని వివరించారు.

కాబట్టి, నీట్, జేఈఈల వాయిదా విద్యార్థుల భవిష్యత్తు, ఐఐటీ అకడమిక్ క్యాలెండర్‌లకు ముప్పు కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, కరోనా కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక వేదనను వాయిదా పడుతున్న తేదీలు మరింత పెంచుతున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Next Story