బాహుబలి అడుగుజాడల్లో ఆర్ఆర్ఆర్ టీం

by Jakkula Samataha |
బాహుబలి అడుగుజాడల్లో ఆర్ఆర్ఆర్ టీం
X

బాహుబలి మూవీ టీం… ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ల మధ్య జరిగిన సోషల్ మీడియా కన్వర్జేషన్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. లైక్ లు, కామెంట్లతో హల్ చల్ చేస్తోంది. అసలు ఏం జరిగింది అంటే? ట్విట్టర్‌లో ఓ అభిమాని ” నేను మాహిష్మతి సామ్రాజ్యానికి చెందిన వ్యక్తిని అని… నేను ఎప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అని బాహుబలి టీంక్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన ఆ టీం.. ఆర్ఆర్ఆర్‌కు ట్వీట్ చేసింది.

” ఆర్ఆర్ఆర్ టీం… మా మాహిష్మతి ప్రజలు మీ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. మేము ఇలా అంటున్నందుకు క్షమించాలి. మీరు ప్రతి పండుగ శుభాకాంక్షలు, థాంక్యూ మెస్సేజ్ లతో సరిపెడుతున్నారు. ఇది మా రాజ్య ప్రజలకు కాలక్షేపంగానే ఉంది. కానీ డియర్ కెప్టెన్ రాజమౌళి సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వండి” అని కోరింది బాహుబలి టీం.

దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ టీం ..”మీరు పెట్టిన మెస్సేజ్ కు కింద పడి దొర్లి మరి నవ్వుతున్నాము…. ఎవరు? ఏం మాట్లాడుతున్నారో చూడండి ! మేము మీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాం ! బాహుబలి ఫ్యాన్స్ ను పోస్టర్స్, ట్రైలర్ కోసం మీరు ఎంత వెయిట్ చేయించారో మరిచిపోలేదు ఇంకా. మేము మా ఫ్యాన్స్ ను ప్రేమిస్తున్నాం.. వాళ్లు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాళ్లకు తెలుసు వాళ్ల నమ్మకాన్ని నిలబెడతామని. కాబట్టి ఫస్ట్ లుక్ కోసం ఇంకాస్త సమయం వెయిట్ చేయండి… త్వరలోనే వచ్చేస్తుంది ” అంటూ బాహుబలి టీంకి ఫన్నీ పంచ్ ఇచ్చింది.

Advertisement

Next Story