- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జనాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ‘ఫంగస్’లు…
దిశ ప్రతినిధి, మేడ్చల్ : కరోనా విరుచుకుపడుతోంది.. తన రూపాలను మార్చుకుంటూ జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్.. ఇంకోవైపు వైట్ ఫంగస్ రూపంలో నగరవాసులను ఊపిరాడనివ్వకుండా ముప్పేట దాడి చేస్తోంది. కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండగా.. తాజాగా వైట్ ఫంగస్ కేసులు బయట పడుతుండడం కలవరానికి గురిచేస్తోంది. ఒక్కో చోట ఒక్కోలా వ్యాపిస్తూ మానవాళి జీవితానికి సవాల్ విసురుతున్నాయి.
వైరస్‌లతో జనం బెంబేలు..
మూడు వైరస్‌లు ముప్పేట దాడి చేయడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కరోనాతో ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులన్నీ కిటకిటలాడుతుండగా, బ్లాక్‌ఫంగస్ కేసులు రోజుకు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. బ్లాక్‌ఫంగస్‌కు నోడల్ కేంద్రంగా ఉన్న కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రి ఫంగస్ కేసులతో నిండిపోయింది. కాగా ఆ ఆసుపత్రిలో నాన్ కొవిడ్ పేషంట్లకు మాత్రమే చికిత్సను అందిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలిరావడంతో ఇక్కడ బెడ్ దొరికే పరిస్థితి లేదు. చికిత్స కోసం పెద్ద సంఖ్యలో బాధితులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అదేవిధంగా కొవిడ్ పాజిటివ్ తో ఉన్న బ్లాక్ ఫంగస్ పేషంట్లను గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి తీవ్రంగా ఉన్నవాళ్లకు శస్త్రచికిత్సలు చేసేందుకు ఈఎన్ టి విభాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.పేషంట్లు అధిక సంఖ్యలో వస్తుండడంతో ఆసుపత్రి యాజమాన్యం హైరనా పడుతోంది.
తాజాగా వైట్ ఫంగస్ దాడి..
కరోనా, బ్లాక్ ఫంగస్ లకు తోడు తాజాగా వైట్ ఫంగస్ దాడి చేస్తోంది. నగరంలోని యశోదా ఆసుపత్రిలో బ్లాక్‌ఫంగస్ కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఓ మహిళలకు వైట్ ఫంగస్ సోకడం కలకలం సృష్టిస్తోంది. ఒకే వ్యక్తికి రెండు వైరస్ లు సోకడంపై ఆందోళన నెలకొంది. ఒకే వ్యక్తికి రెండు ఫంగస్ లు సోకడం చాలా అరుదుగా జరుగుతుందని బాధిత మహిళకు చికిత్స చేస్తున్న ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ మనుశృత్ తెలియజేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులలో సైతం రెండు రకాల ఫంగస్ కేసులు ఉన్నట్లు తెలుస్తొంది. కరోనా పేషంట్లకు స్టెరాయిడ్ అధికంగా వాడడం వల్లనే ఫంగల్ ఇన్పెక్షన్లు దాడి చేస్తున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. కరోనా నుంచి కొలుకోని ఇంటికి వెళ్లిన తర్వాత బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కేసులతోనే పరేషాన్ అవుతున్నా జనాన్ని.. వైట్ ఫంగస్ కూడా వెలుగులోకి రావడం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అయితే వైట్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు మందుల కొరత లేదని, బ్లాక్ ఫంగస్ వైద్యానికి మాత్రమే మందుల కొరత వేధిస్తోస్తుందని వారంటున్నారు.. గత సంవత్సర కాలంగా కరోనా కాటుతో ఉక్కిరిబిక్కిర అవుతున్న ప్రజానీకం మరో రెండు ఫంగస్ లు అటాక్ చేస్తుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.