- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శుభం కలుగుతుందని చిలుకను అలా చేశారు
దిశ,పాలేరు: కోతులను ఆంజనేయ ప్రతిరూపంగా భావించి అంత్యక్రియలు నిర్వహించడం చూశాం, విన్నాం,సహజంగా నిర్వహిస్తారు కూడా…కానీ ఓ గ్రామస్తులు రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించడం కొత్తగా వింటున్నాం,కాదు కాదు దిశ ఆ దృశ్యాన్ని మీకు చూపిస్తుంది…
వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో మేడేపల్లి నుంచి కట్టకూరు వెళ్లే మార్గంలో మంగళవారం ఓ రామ చిలుక ప్రమాదవశాత్తు అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందింది. స్థానిక రైతులు తమ వ్యవసాయ భూమిలో అపస్మారక స్థితిలో ఉన్న రామచిలుక తమ కళ్లెదుటే చనిపోవటాన్ని చూసి రామచిలుకకు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి తమ భక్తిని చాటారు. ఈ సందర్భంగా దిశ తో మేడేపల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ రామచిలుక మా కళ్లెదుటే ప్రాణాలు విడిచిందని దీనితో చిలుకకు అంత్యక్రియలు నిర్వహించటం రామునికి సేవ చేసినట్లుగా భావిస్తున్నట్లు వివరించారు. మనుషులపై ఆధారపడి సహజీవనం సాగిస్తున్న పశువులూ, పక్షులు చనిపోయిన సందర్భాల్లో బాధ కలుగుతుందని,చిలుకకు అంత్యక్రియలు నిర్వహిస్తే శుభం కలుగుతుందనే భావనతో నిర్వహించామని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మనపై ఆధారపడి జీవించే పశువులూ, పక్షులు మరణించిన సందర్భాల్లో వాటిని అలా వదిలేయకుండా అంత్యక్రియలు నిర్వహించడం ద్వారా తోటి జీవుల పట్ల మనకున్న బాధ్యత గుర్తుకు చేస్తుందన్నారు.అంత్యక్రియలు నిర్వహించిన విషయం తెలుసుకొని మేడేపల్లి గ్రామ రైతులు,గ్రామస్తులను పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో గ్రామ రైతులు సామినేని పూర్ణచందర్ రావు, మధుసూదన్ రావు,నంద్యాల అప్పయ్య, మోర వెంకటరామారావు, ఎడవెల్లి గ్రామానికి చెందిన పరికపల్లి ఆదినారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.