- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేనేత కార్మికులకు గుడ్‌న్యూస్.. భారీగా నిధులు విడుదల
by Shyam |
X
దిశ, డైనమిక్ బ్యూరో: చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం చేనేత, జౌళిశాఖపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పథకాలు, అమలు తీరుపై ఆయన చర్చించారు. వారికి మరింత తోడ్పాటు నిచ్చే విధంగా సంక్షేమ పథకాలకు రూ.73.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ నిధులను సంఘాలు, చేనేత కార్మికులకు వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేతన్నల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకాలను అమలుచేస్తేనే వారికి మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉంటుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story