- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కళకళలాడిన కనకదుర్గ వైన్స్.. కరోనా సంగతి తర్వాత..!
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో మందు బాబులు బరితెగించారు. మద్యం కోసం ఆపసోపాలు పడుతూ భారీ సంఖ్యలో మద్యం దుకాణం ముందు బారులు తీరారు. రాత్రి 8 గంటలకే షాపులు మూత పడుతుండటంతో మందు దొరుకుంతుందో లేదోనని తెగ ఆరాటపడుతున్నారు.ఆదివారం రామారెడ్డి చౌరస్తాలో ఓ వైన్ షాపు ఎదుట కనిపించిన దృశ్యం కరోనా అంటే వారికి ఎంత భయం ఉందో గుర్తుచేసింది. అసలే కేసులు జిల్లా వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్నా వైన్ షాపు నిర్వహకులు సైతం నిబంధనలు పాటించడంతో పాటు పాటించాలని కస్టమర్లకు చెప్పడంలో విఫలం అవుతున్నారు.
వైన్ షాపుల వద్ద మాస్కు ధరించి దూరం పాటిస్తేనే మద్యం విక్రయించాలని అదేశాలున్నా అవేవి పట్టించుకోవడం లేదు. దుకాణంలో ఉన్న స్టాక్ ఎంత తొందరగా అమ్ముడు పోతే అంత మంచిదని భావిస్తూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. కరోనా సమయంలో వైన్ షాపుల వద్ద నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే దానిపై ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షించడంలో విఫలమయ్యారు. వైన్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో జిల్లా వ్యాప్తంగావిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా గుంపులుగా గుమిగూడితే కరోనా సోకకుండా ఎలా ఉంటుందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.