‘రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలి ’

by Shyam |
‘రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించాలి ’
X

– ప్రభుత్వానికి ట్రెసా విజ్ఞప్తి

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌లో పోలీస్, మెడికల్, మున్సిపల్/పంచాయతీ రాజ్ శాఖలతో సమానంగా పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి వేతనాన్ని అందించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. నాంపల్లిలోని ట్రెసా కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నివారణ చర్యల్లో శక్తివంచన లేకుండా పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు సగం జీతం ఇవ్వడం చాలా బాధాకరమని, వీఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరికీ పూర్తి స్థాయి వేతనం ఇవ్వాలని సమావేశంలో కోరారు. పౌర సరఫరాల శాఖ పరిధిలో కూడా రెవెన్యూ ఉద్యోగులే పనిచేస్తున్నారని, కీలక సమయంలో ఉద్యోగుల జీతాలను కోత విధించి బాధపెట్టొద్దని ట్రెసా సభ్యులు కోరారు. (26) మంది తహసీల్దార్లు మూడు నెలల నుంచి పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్న వారిని గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె. రామకృష్ణ, కార్యదర్శి బాణాల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

tags : Revenue employees, TRESA, lockdown, Nampally

Advertisement

Next Story