- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రంట్ లైన్ వారియర్స్ కృషి మరువలేనిది.. తమిళ సై
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళ సై ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆర్థిక సంక్షోభం నుండి తెలంగాణ త్వరగా కోలుకుంది. రెవెన్యూ వసూళ్లలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లు చాలా కష్ట పడ్డారు. ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వ్యవసాయ రంగానికి 24 గంటల పవర్ అందిస్తూ.. విద్యుత్ రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు సాధిస్తున్నదని అన్నారు. తెలంగాణవ్యాప్తంగా మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరింది. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. తెలంగాణలో 57.26లక్షల ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. గిరిజన గ్రామాలకు, తండాలకు మంచినీటి సౌకర్యం అందుతోంది అని అన్నారు.