‘సర్దార్’కు షాకిచ్చిన ఫ్రెండ్స్.. రాజకీయాలు స్నేహం వేరంటూ..!

by Sridhar Babu |   ( Updated:2021-12-03 10:16:08.0  )
‘సర్దార్’కు షాకిచ్చిన ఫ్రెండ్స్.. రాజకీయాలు స్నేహం వేరంటూ..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాజకీయాలకు, స్నేహానికి చాలా తేడా ఉంటుందని కరీంనగర్‌కు చెందిన పలువురు కార్పొరేటర్ల భర్తలు తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ క్యాంపులో ఉన్న వీరంతా తాము పార్టీ అభ్యర్థులకు మాత్రమే మద్దతిస్తామని, రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సర్దార్ రవీందర్ సింగ్‌కు మాత్రం ఓటు వేయమని ప్రకటించారు. తమతో ఉన్న స్నేహాన్ని ఆసరాగా తీసుకుని, తాము ఆయనకు ఓట్లు వేస్తామని మాట ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నారని, ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ కూడా రవీందర్ సింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, ఆయన్ను మేయర్ చేసిందన్నారు. అయినప్పటికీ ఆయన పార్టీకి ద్రోహం చేసి పోటీలో నిలబడటం సరికాదన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా రవీందర్ సింగ్‌కు అనుకూలంగా ఓట్లు వేసేది లేదన్నారు. ఈ వీడియోలో ఎడ్ల అశోక్, పిట్ల శ్రీనివాస్, నేతికుంట యాదయ్యలు తమ వైఖరిని కుండబద్దలు కొట్టి చెప్పారు. రవీందర్ సింగ్‌కు స్నేహితులుగా ఉన్న వీరు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story