- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలి కోసం ఫ్రెండ్ హత్య
దిశ, వెబ్‌డెస్క్ : ప్రియురాలి కోసం తన స్నేహితుడికి విషం తాగించాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యడ్లపాడుకు చెందిన గోపివర్మ, సమీపంలోని మర్రిపాలెనికి చెందిన కొమ్మూరి ప్రేమ్‌చంద్ స్నేహితులు. ఓ యువతితో ప్రేమలో పడిన ప్రేమ్‌చంద్ తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. తనకు ఫోన్ లేకపోవడంతో తన ఫ్రెండ్ గోపీ ఫోన్ నుంచి మాట్లాడేవాడు. ఈ క్రమంలో ప్రియురాలు తనకు తెలియకుండా గోపీతో మాట్లాడుతున్నాడని గుర్తించి గొడవపడ్డాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం శత్రుత్వంగా మారింది. కోపంతో రగిలిపోయిన ప్రేమ్‌చంద్ గోపీను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
యడ్లపాడు నుంచి నాదెండ్ల వెళ్లే రోడ్డులో ఉన్న చప్టా వద్దకు గోపీవర్మను రప్పించాడు ప్రేమ్‌చంద్. ఇద్దరం కలిసి చనిపోదామని గోపీని నమ్మించిన ప్రేమ్‌చంద్.. గడ్డిమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించి ప్రేమ్‌చంద్ పరారయ్యాడు. దీంతో గోపీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 7వ తేదీన మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా.. శనివారం ఉదయం గోపి మృతి చెందాడు. గోపీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ్‌చంద్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.