శుక్రవారం పంచాంగం, రాశిఫలాలు (14-05-2021)

by Hamsa |   ( Updated:2021-05-14 02:12:03.0  )
శుక్రవారం పంచాంగం, రాశిఫలాలు (14-05-2021)
X

ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
నక్షత్రం : రోహిణి (నిన్న తెల్లవారు జాము 2 గం॥ 41 ని॥ నుంచి
ఈ రోజు తెల్లవారు జాము 5 గం॥ 45 ని॥ వరకు)
యోగము : సుకర్మము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఉదయం 12 గం॥ 2 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
అమృతఘడియలు : (తెల్లవారు జాము 2 గం॥ 8 ని॥ నుంచి 3 గం॥ 56 ని॥ వరకు)( తెల్లవారు జాము 2 గం॥ 8 ని॥ నుంచి 3 గం॥ 56 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 46 ని॥ నుంచి మర్నాడు తెల్లవారు జాము 0 గం॥ 33 ని॥ వరకు)
దుర్ముహూర్తం : ( ఉదయం 8 గం॥ 19 ని॥ నుంచి 9 గం॥ 10 ని॥ వరకు)( ఉదయం 12 గం॥ 37 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 28 ని॥ వరకు)
రాహుకాలం : ( ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి 12 గం॥ 11 ని॥ వరకు)
గుళికకాలం : (ఉదయం 7 గం॥ 21 ని॥ నుంచి 8 గం॥ 58 ని॥ వరకు)
యమగండం : (సాయంత్రం 3 గం॥ 25 ని॥ నుంచి 5 గం॥ 2 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 40 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : వృషభము

మేష రాశి : సమయానికి అనుకున్న విధంగా ధనం చేతికి అందక పోవచ్చు. ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ధనం ఖర్చయ్యే అవకాశం. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలుస్తారు విడిపోవాలని భావించిన వారితో సఖ్యత కుదురుతుంది. ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు పెద్ద వారి ఆశీస్సులు తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు కీళ్ల నొప్పులు గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

కర్కాటక రాశి : కుటుంబానికి సంతానం ఆర్థికంగా ఉపయోగపడతారు. కుటుంబ వ్యవహారాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కాలాన్ని మంచి పనులకోసం వినియోగించండి. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆనందాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కష్టపడతారు. శాస్త్ర సాంకేతిక విషయాలపై శ్రద్ధ చూపిస్తారు. వివాదాస్పద విషయాలపై ఎటువంటి argue చెయ్యకండి. ఈ రాశి స్త్రీల కి మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల కి మంచి పేరు వస్తుంది.

మిధున రాశి : ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన ధనం మీ చేతికందుతుంది. పాజిటివ్ గా ఆలోచించడం వలన మీకు ఎదురైన సమస్యను సులభంగా పరిష్కరించ గలుగుతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వారి సూచనలు పనిచేస్తాయి. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు అపోహలు ఊహలతో కాలం వృధా గడిపేస్తారు.

కన్య రాశి : నా జీవితం నా ఇష్టం అనే మూర్ఖపు పట్టుదల నుంచి ఈ కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్త వహించాలి. ఎటువంటి అవరోధాలు నైనా తేలికగా అధిగమిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు మీ అంచనాలను దాటి పోతాయి. ఈ రాశి స్త్రీలకు గృహము ను కొనుగోలు చేస్తారు.

సింహరాశి : ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్ మరియు బదిలీకి అవకాశం. మీకు ఏమాత్రం సంబంధం లేని గొడవలకు మీరే కారణమని ప్రచారం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఆశయాలు నెరవేరే అవకాశం. ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం. కరోనా వల్ల వ్యాపారంలో ఇబ్బందులున్నా లాభాలు ఉంటాయి. అనుకోని అతిథుల వల్ల అనవసర ఖర్చు రావచ్చు. ఈ రాశి స్త్రీలకు మీరు చేయవలసిన పనుల గురించి వేరే వారి సలహా తీసుకోకుండా పనులు పూర్తి చేస్తారు.

వృశ్చిక రాశి : సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో కరోనా వల్ల నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ సొంత ప్రయోజనాల కోసం ఇష్టం లేని వ్యక్తులతో కలిసి పని చేయవలసి వస్తుంది. మీ తల్లి గారి వైపు నుంచి ధనలాభం ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగంలో సహ ఉద్యోగుల ప్రవర్తన వల్ల వాళ్ళకి సంస్కారం లేదని గ్రహిస్తారు.

తులారాశి : సక్రమంగా ఆలోచనలు చేసి ఆచితూచి మాట్లాడే మీ వైఖరి మీకు మేలు కలిగిస్తుంది. ఉద్యోగంలో కొంత మంది ప్రవర్తన నచ్చకపోయినా భరించవలసి వస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలం ఉంది. నిజమైన ప్రేమ అనురాగాలు కలిగిన వ్యక్తులను దూరం చేసుకున్నందుకు బాధపడతారు. మత్తు పదార్ధాలకు దూరంగా ఉండండి ఎందుకంటే ఆలోచనలు సక్రమంగా ఉండవు. ఈ రాశి స్త్రీలకు ప్రభుత్వ పరంగా మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

కుంభరాశి : మీ ముందుకు రకరకాల ధన ఆదాయాల గురించి ప్రణాళికలు వస్తాయి వాటిలో నుంచి జాగ్రత్తగా కావలసినవి ఎంచుకోండి. అనుకోని బహుమతులు లభించే అవకాశం. శుభవార్తలు వింటారు మరియు ఆనందకరమైన వాతావరణం. ఏకాగ్రతతో పని చేయండి. మీరు నమ్మిన సిద్ధాంతం మిమ్మల్ని ఎప్పుడూ గెలిపిస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీరు చెయ్యదలుచుకున్న కార్యక్రమాలను నిర్భయంగా చేస్తారు.

ధనుస్సు రాశి : సున్నితమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీ తోటి వారిని సంప్రదించండి. వ్యాపారంలో కరోనా వల్ల ఇబ్బందులు ఉన్నా అంచనాలకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగంలో మీ పైన అధికారులు మీ శ్రమ ను గుర్తిస్తారు. ఊహల లో నుంచి బయటకు వచ్చి నిజంగా మీకు ఏది కావాలో గుర్తించండి. వ్యాపారంలో మీ బంధువుల నుండి తగిన సహాయం అందుతుంది. ఈ రాశి స్త్రీలకు విద్యా సంబంధమైన విషయాలలో అభివృద్ధి గోచరిస్తోంది.

మకర రాశి : ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారంలో కరోనా గురించి సొంత నిర్ణయం తీసుకోండి. మంచి ఫలితం ఉంది. స్నేహితులు, తోడబుట్టిన వారు మరియు ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. మీరు ఊహించని మార్గాల ద్వారా ధనం లభిస్తుంది. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొల్పడానికి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు చిన్న విషయాలకు కూడా అయినవాళ్లు అపార్థం చేసుకోవడం మీ మనోవేదనకు కారణమవుతుంది.

మీన రాశి : స్పెక్యులేషన్ కి దూరంగా ఉండడం మేలు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. మీరు పడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీకు అత్యంత ఆప్తులు దగ్గర లేరు అనే భావన నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన స్నేహితులు మిమ్ములను అప్పు అడిగే అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీలు మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు.

వృషభ రాశి : ఆడంబరాల కోసం మీరు చేసే దుబారా ఖర్చు వలన మీ పెద్దవారు ఆగ్రహించి అవకాశం. మీకు రావలసిన ఇంటి అద్దెలు ఆలస్యం అవుతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. మనోబలంతో విజయం వరిస్తుంది. స్వయం కృషి ఫలిస్తుంది. శుభకార్యాల విషయమై ఇంట్లో చర్చలు జరుగుతాయి. ఈ రాశి స్త్రీలకు డబ్బు దగ్గర నమ్మిన వ్యక్తులు మిమ్ములను మోసం చేసే పరిస్థితి.

Advertisement

Next Story