- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ఏపీ ఇంటర్ ఫలితాలు
దిశ, న్యూస్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు శుక్రవారం సాయంత్రం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల వార్షిక పరీక్షా ఫలితాలను విడుదల చేయనుంది. ఈసారి సీడీల ద్వారా కాకుండా కేవలం వెబ్‌సైట్లలో మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు సైట్ లో మాత్రమే చూసుకోవాలని కోరింది. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ తదితర వివరాలను ఇవ్వడం ద్వారా వెబ్‌సైట్‌లో ఫలితాన్ని చూసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సబ్జెక్టుల వారీ మార్కుల్ని మాత్రమే ఇస్తామని, గ్రేడింగ్ పాయింట్లు లేదా గ్రేడింగ్ వివరాలను ఇవ్వబోమని ఏపీ ఇంటర్ బోర్డు ఆ ప్రకటనలో పేర్కొంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం గ్రేడింగ్ పాయింట్లను ఇస్తామని తెలిపింది. ఇప్పటికే ప్రథమ సంవత్సరం ఫలితాల్లో వారికి గ్రేడింగ్ పాయింట్లు ఇచ్చినందున, వాటికి అనుగుణంగా ద్వితీయ సంవత్సరం గ్రేడింగ్‌ను కూడా పొందుపరుస్తున్నట్లు చెప్పింది. షార్ట్ మార్కుల జాబితాను కూడా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి తీసుకోవచ్చని బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.