- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రేపు భారత్‌కు రానున్న ఫ్రెంచ్ రక్షణ మంత్రి
by Shamantha N |
X
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ బలోపేతం చేయడానికి ఫ్రెంచ్ రక్షణశాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ శుక్రవారం భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో సమావేశమై, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు’ అని ఢిల్లీలోని ఫ్రెంచ్ దౌత్యకార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
దీనిలో భాగంగా ఇరు దేశాల రక్షణ సహకారం విస్తృతం చేయడం, ఉగ్రవాద నిర్మూలనకు సహకారంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతతో పాటు పరిశ్రమ, సాంకేతిక భాగస్వామ్యం ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపింది. దీంతో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్‌తోనూ పార్లీ సమావేశం కానున్నారు. ఈ మధ్యనే మరణించిన మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ సింగ్ రావత్‌తో పాటు ఇతర అధికారులకు నివాళులు ఆర్పించనున్నారు.
Advertisement
Next Story