అవార్డ్ ఫంక్షన్‌లో వేదికపై డ్రెస్‌ విప్పేసిన హీరోయిన్!

by Anukaran |
French Actress Corinne Masiero Protest Nakedly
X

దిశ, సినిమా: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం ఇండియాలో పరిస్థితులు కాస్త నార్మల్ అయినా.. ఫ్రాన్స్‌లో మాత్రం థియేటర్లు, సినిమా హాళ్లు మూతబడే ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన నటి కోరెన్ మాసిరో వినూత్న రీతిలో నిరసన తెలిపింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన సీజర్ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆమె.. అందంగా ముస్తాబై వేదిక మీదకు చేరగానే అందరి అటెన్షన్‌ క్యాచ్ చేసింది. తన డ్రెస్సింగ్, మేకప్ గురించి అందరూ మాట్లాడుకుంటుండగానే.. ఒక్కసారిగా డ్రెస్ విప్పేసింది. ఈ అనుకోని ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ మేరకు తన ఒంటిపై ప్రధాని జీనప్ కాస్టెక్స్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓ మెసేజ్‌ను ప్రదర్శించి ‘కల్చర్ లేకపోతే ఫ్యూచర్ లేదు.. ఆర్టిస్టులను, ఆర్ట్‌ను కాపాడండి’ అంటూ అవార్డుల ఫంక్షన్‌లో నగ్నంగా నిరసన ప్రదర్శించింది.

Advertisement

Next Story

Most Viewed