గ్రేటర్ వాసులకు గుడ్‌ న్యూస్

by Anukaran |
గ్రేటర్ వాసులకు గుడ్‌ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వాసులకు కొత్త సంవత్సర కానుక ఇచ్చింది. నూతన సంవత్సర తొలి వారంలోనే నగరంలో ఉచిత తాగునీటి కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. శనివారం ఉచిత నీటిపై కావలసిన కార్యాచరణ పైన మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ జలమండలి ద్వారా 20,000 లీటర్ల వరకు తాగు నీటి వినియోగం ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి తోడు జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఒకటి రెండ్రోజుల్లోనే సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed