నిరుద్యోగులకు శుభవార్త.. శిక్షణ ఇచ్చి రోజుకు రూ.237 చెల్లిస్తారు

by Sridhar Babu |   ( Updated:2021-12-11 09:12:17.0  )
good-news1
X

దిశ, మర్పల్లి: నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ కింద ఉచిత శిక్షణ హాస్టల్ వసతి మరియు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని మర్పల్లి ఎంపీడీవో వెంకటరాం గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలానికి చెందినవారై ఉండి.. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పూర్తి చేసుకున్న కుటుంబంలోని పిల్లలను ఉచిత శిక్షణ కై ఎంపిక చేసి డ్రైవింగ్, పాల్ సీలింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, పెయింటింగ్ అండ్ డిఫ్రెనిషేర్, ప్లంబింగ్ అండ్ శానిటేషన్, స్టోర్ కీపర్, వెల్డింగ్, ల్యాండ్ సర్వేయర్, పవర్ కవర్స్ క్యాండిల్స్ తయారీ, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఫోటోగ్రఫీ, కంప్యూటర్ హార్డ్వేర్, మోటార్ వైండింగ్, హౌస్ వైరింగ్, డైరీ, గొర్రెల పెంపకం, కూరగాయల పెంపకం, ఫ్రెష్ వాటర్, వర్మి కంపోస్ట్ తయారీ తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అభ్యర్థులకు ఉపాధి హామీలో చెల్లించే రోజు వారి కనీస వేతనం రూ.237 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పై కోర్సులకు 18 నుంచి 40 సంవత్సరాల లోపువారు ఈ నెల 15వ తేదీ లోగా ఉపాధిహామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story