కరోనా బాధితులకు ఉచిత సేవ.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

by Shyam |
కరోనా బాధితులకు ఉచిత సేవ.. ఈ నెంబర్లకు కాల్ చేయండి
X

దిశ, ప్రగతి నగర్ : ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఉచిత సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సేవలు పొందలేని వారికి మందులు, కూరగాయలు, నిత్యవసర సరుకులు తెచివ్వడం, ఉచిత భోజన సౌకర్యం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విప్లవ్ మాట్లాడుతూ.. కరోనా బాధితుల కోసం కొవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 7093926051,7093926052 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. ఉచిత భోజనం పొందాలనుకునేవారు ఉదయం 8 గంటల లోపు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోప్రవీణ్, రాజేష్, ధనుష్,రవి, దినేష్, మార్క్స్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story