ఉద్దానం బాధితులకు ప్రయాణం ఫ్రీ

by srinivas |
ఉద్దానం బాధితులకు ప్రయాణం ఫ్రీ
X

దిశ ఏపీ బ్యూరో: ఉద్దానం కిడ్నీవ్యాధి బాధితులకు ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కరోనా కష్టకాలంలో డయాలసిస్‌కి వెళ్లేందుకు కిడ్నీ బాధితులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సడలింపులతో బస్సులు నడుపుతున్నప్పటికీ ఛార్జీలు, ఇతర ఖర్చులు శక్తికి మించి భారంగా మారాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం కిడ్నీ బాధితులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించింది.

శ్రీకాకుళం జిల్లాలోని 38 మండలాల పరిధిలో 2,856 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు. వీరంతా శ్రీకాకుళం, పార్వతీపురం, పాలకొండ, విజయనగరం, వైజాగ్ తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు డయాలసిస్ కోసం వెళ్తుంటారు. వారి ఆరోగ్యపరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితులందరికీ ఉచిత పాసులు పంపిణీ చేయనున్నారు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డయాలసిస్ చేయించుకునే కిడ్నీ బాధితులకు ప్రతి నెలా 10,000 రూపాయల పెన్షన్, సీరం క్రియేటినైన్ 5కు మించి ఉన్నవారికి 5,000 రూపాయల పెన్షన్ అందజేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed